‘బోల్డ్.. ఒరిజినల్.. బ్రిలియంట్.. ‘అర్జున్ రెడ్డి’ -మహేష్ ట్వీట్
హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్ర బృందాన్ని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. చిత్రం కొత్త తరహాలో ఉందని, విజయ్ అద్భుతంగా నటించారని అన్నారు. కాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు.
‘బోల్డ్.. ఒరిజినల్.. బ్రిలియంట్.. ‘అర్జున్ రెడ్డి’ సాధారణ మార్గాన్ని బ్రేక్ చేసిన చిత్రం. విజయ్ దేవరకొండ లైఫ్‌టైమ్ పర్ఫామెన్స్‌తో వచ్చారు. అద్భుతంగా చేశారని చెప్పడం కూడా తక్కువే. షాలిని, ఆమె స్నేహితుల పాత్రలు బ్రిలియంట్‌గా ఉన్నాయి. సందీప్‌రెడ్డి వంగా రచన, దర్శకత్వం చాలా బావున్నాయి. ఇది ఆయన తొలి చిత్రమంటే నమ్మడం చాలా కష్టం. మీకు, మీ మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్ ట్వీట్ చేశారు.

Comments
Post a Comment