బీహార్ జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై కాల్పులు
బీహార్ జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై కాల్పులు
ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఉదంతం మర్చిపోక ముందే మరో జర్నలిస్ట్ పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌లోని అరవల్‌లో గురువారం జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రాష్ట్రీయ సహారా దినపత్రికలో ఆయన పని చేస్తున్నారు.
ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి పంకజ్ మిశ్రాపై కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే పంజక్ మిశ్రా ఈరోజు మధ్యాహ్నం బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దుండగులు కాల్పులు జరిపి, ఆయన వద్ద నుండి నగదు దోచుకెళ్లినట్లు అరవల్ ఎస్పీ వెల్లడించారు.

Comments
Post a Comment