GST ఒకే దేశం.. ఒకే పన్ను...మరికొన్ని గంటలలో

జీఎస్టీ ఒకే దేశం.. ఒకే పన్ను...మరికొన్ని గంటలలో

జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత అత్యధిక స్థాయిలో ఉత్పత్తుల ధరలు యథావిధిగా ఉండనున్నప్పటికీ, తగ్గే అవకాశాలు మాత్రం లేవు. కానీ కొన్ని ఉత్పత్తులు ప్రియంకానున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సేవలపై విధించే పన్ను పెరుగుతుండటంతో వినియోగదారులపై మరింత భారం పడనున్నది. ఆర్థిక సేవల్లో భాగంగా ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియం, నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి. జీఎస్టీతో ఆర్థిక సేవలు 18 శాతం స్లాబ్‌లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ సేవలపై 15 శాతం పన్ను విధిస్తున్నారు. దీంతో బిల్లులు మూడు శాతం వరకు పెరుగనున్నదన్నమాట. ఉదాహరణకు వార్షిక బీమా ప్రీమియం కోటి రూపాయల టర్మ్ ప్లాన్‌పై విధించే పన్ను రూ.3,750 నుంచి రూ.4,500కి పెరుగనున్నది. అలాగే నాలుగు ఏటీఎం లావాదేవీలు పూర్తైన తర్వాత జరిగే ప్రతిలావాదేవీపై ఎస్‌బీఐ రూ.50తోపాటు సేవాపన్ను(15 శాతం) విధిస్తుండగా, జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను 18 శాతం విధించనున్నది. ప్రస్తుతం రూ.10 వేల విత్‌డ్రాపై రూ.1,550 చెల్లించాల్సి ఉండగా, జీఎస్టీతో సేవా పన్ను రూ.1,850కి చేరుకోనున్నది. చార్జీల విధింపుపై ఇప్పటికే బ్యాంకులు, బీమా రంగ సంస్థలు తమ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారాన్ని చేరవేశాయి. బ్యాంకుల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థలు చార్జీల విధింపుపై ఎస్‌ఎంఎస్‌లు పంపాయి.
GST రేట్ కార్డ్ : తగ్గేవి – పెరిగేవి ఇవే

ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్ కు దేశం సన్నద్ధం అవుతుంది. మరికొన్ని గంటల్లో కొత్త వ్యవస్థలోకి అడుగుపెడుతున్నాం. దేశంలోని ప్రతి మనిషిపై GST ప్రభావం ఉంటుంది. ఇప్పటి వరకు వస్తువుపై విధిస్తున్న పన్ను విధానం మొత్తం సమూలంగా మారబోతుంది. మరి ఆ రేటు ఇప్పుడు ఎలా ఉన్నాయి.. జూలై ఒకటి నుంచి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాల్సిందే. ఆయా వస్తువులపై ప్రస్తుతం పన్ను ఎంత ఉంది.. GSTలో ఎంత ట్యాక్స్ విధించారో తెలుసుకుందాం… రోజువారీ వినియోగంలో ఇవి కొన్ని మాత్రమే. మొత్తం 1200 వస్తువుల ధరలు మారబోతున్నాయి.

టీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18%(తగ్గుతుంది)

కాఫీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

చక్కెర : ప్రస్తుతం 10%, GST తర్వాత 5శాతం (తగ్గుతుంది)

నెయ్యి : ప్రస్తుతం 5%, GST తర్వాత 12శాతం (పెరుగుతుంది)

వెన్న : ప్రస్తుతం 14.5%, GST తర్వాత 12శాతం (తగ్గుతుంది)

హెయిర్ ఆయిల్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

టూత్ పేస్ట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

సబ్బులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

బ్రాండెడ్ రైస్ : ప్రస్తుతం లేదు. GST తర్వాత 5శాతం (పెరుగుతుంది)
( 10కేజీల రైస్ బ్యాగ్ 25రూపాయలు పెరుగుతుంది)

చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

బర్త్ డే, ఇతర కేకులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

ఐస్ క్రీమ్స్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

మొబైల్ ఫోన్స్ : ప్రస్తుతం 6%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)

కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు : ప్రస్తుతం 6%, GST తర్వాత 18శాతం (పెరుగుతాయి)

ఫర్నీచర్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)

ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)

బ్రాండెడ్ నూడుల్స్ : ఒక శాతం పెరుగుతున్నాయి.

కూల్ డ్రింక్స్ : ఒకశాతం పెరుగుతున్నాయి.

పిజ్జా, బర్గర్స్ : మూడు శాతం తగ్గుతున్నాయి. ప్రస్తుతం రూ.100 ఉంటే.. GST తర్వాత రూ.97 అవుతుంది.

చెప్పులు, బూట్లు ధరల్లో మార్పులు ఇలా :

రూ.1000 పైన : ప్రస్తుతం 26.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)

రూ.500-1000 మధ్య ఉంటే : ప్రస్తుతం 20.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)

రూ.500లోపు ఉంటే : ప్రస్తుతం 5%, GST తర్వాత 5శాతం (మార్పు లేదు)

రెడీమేడ్ దుస్తులు ధరల్లో మార్పులు ఇలా :

రూ.1000పైన కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 12%, GST తర్వాత 4.5శాతం (తగ్గుతాయి)

రూ.1000లోపు కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 5%, GST తర్వాత 2.5శాతం (తగ్గుతాయి)

టీవీలు : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతాయి)

వాషింగ్ మెషీన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

ఫ్రిడ్జ్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

మెక్రోఓవెన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)

సిమెంట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 28శాతం (తగ్గుతుంది)

పెద్ద వాహనాలు (కమర్షియల్) : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి)

SUV కార్లు : ప్రస్తుతం 55%, GST తర్వాత 43శాతం (తగ్గతాయి)

లగ్జరీ కార్లు : ప్రస్తుతం 49%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)

మీడియం కార్లు : ప్రస్తుతం 47%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)

చిన్నకార్లు : ప్రస్తుతం 30%, GST తర్వాత 29శాతం (తగ్గుతాయి)

బైక్స్ : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి)

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు