ఆకాశంలో నెలవంక..  రంజాన్ శోభ


పవిత్ర రంజాన్‌ సోమవారం జరుపుకోనున్నారు ముస్లింలు. ఆదివారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కనిపించడంతో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను సోమవారం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. గత నెలరోజులుగా పాటిస్తున్న ఉపవాస దీక్షలకు ముగింపు పలకనున్నారు ముస్లింలు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో గంగా జమున తెహజీబ్‌ సంస్కృతి ప్రతిబింబించేలా పండగ జరుపుకోవాలని ఆయన ఆకాక్షించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు