రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని మీరాకుమార్‌ శుక్రవారం సబర్మతి ఆశ్రమం నుంచే ప్రారంభించారు

అహ్మదాబాద్‌: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో కొద్ది సేపు ఛరఖా తిప్పి నూలు వడికారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని మీరాకుమార్‌ శుక్రవారం సబర్మతి ఆశ్రమం నుంచే ప్రారంభించారు. గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలతో కలిసి వెళ్లిన ఆమె ఆశ్రమంలో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నారు. ‘ప్రస్తుతం నా పోరాటం గాంధీజీ సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే’ అని ఆమె పేర్కొన్నారు.
ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ బుధవారం పార్లమెంటు హౌస్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. పాలక ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా ఆమె బరిలోకి దిగారు. ఇప్పటికే కోవింద్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా.. మీరాకుమార్‌ శుక్రవారం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. 20న ఫలితాలు వెలువడనున్నాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు