నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నియామకం







నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నియామకం

ఢిల్లీ: సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్(86) నూతన అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు. వేణుగోపాల్ నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అతిత్వరలోనే విడుదల కానున్నాయి. మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వేణుగోపాల్ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2జీ స్పెక్ట్రం కేసులో అమికస్ క్యూరీగా వాదనలు వినిపించారు. మండల్ కేసు, అయోధ్య వివాదం, న్యాయవ్యవస్థలో నియామకాలపై సమర్థవంతంగా ఆయన తన వాదనలు వినిపించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు, బీజేపీ సీనియర్ నేత అద్వానీ అయోధ్య కేసు, మాయవతి అవినీతి కేసులను వేణుగోపాల్ వాదించారు. 50 ఏళ్ల తన సుదీర్ఘ కేరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. 2015లో పద్మ విభూషణ్, 2002లో పద్మ భూషణ్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వేణుగోపాల్‌ను వరించాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు