18వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. రైతుకు ఊరట

న్యూఢిల్లీ: జీఎస్టీ 18వ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎరువులపై ప్రతిపాదించిన 12 శాతం వస్తు సేవల పన్నును 5 శాతానికి తగ్గించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో చివరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జీఎస్టీ అమలుపై సభ్యులు తుది కసరత్తు చేశారు.
రైతులపై భారం పడుతుందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఎరువులపై ప్రతిపాదించిన పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి కుదించినట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అలాగే ట్రాక్టర్ల విడి విభాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ఆయన వివరించారు. శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరగనున్న ప్రత్యేక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో జులై 1 నుంచి జీఎస్టీ దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తుంది.

Comments
Post a Comment