ఆన్‌లైన్లో ఔషధాల అనుమతులు : మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : ఆన్‌లైన్లో ఔషధాల అనుమతుల విధానం కోసం మెరిట్ వెబ్‌సైట్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వెబ్‌సైట్ ప్రారంభంతో ఇకపై ఔషధాల అనుమతుల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలగనుంది. వైద్యవిద్య, పరిశోధనల ప్రోత్సాహానికి మెరిట్ అప్లికేషన్ ఉపయోగపడనుంది. విద్యార్థులు, అధ్యాపకులకు సౌకర్యంగా ఉండేలా మెరిట్ అప్లికేషన్‌ను రూపొందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సరళతర వాణిజ్య విధానంలో భాగంగా ఆన్‌లైన్లో ఔషధ అనుమతులు ఇస్తామన్నారు. ఈ విధానం రేపట్నుంచి అమల్లోకి వస్తుందన్నారు. గతంలో ఔషధ లైసెన్స్‌ల కోసం వ్యాపారులు ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఇకపై ఔషధ లైసెన్స్‌ల కోసం వ్యాపారులు ఇబ్బందులు పడక్కర్లేదని స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో 165 పడకలతో ఐసీయూ, అత్యాధునిక లేబొరేటరి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ కిట్ల కోసం ఇప్పటి వరకు 3.65 లక్షల మంది దరఖాస్తు చేశారని తెలిపారు. వేరికోజ్ వీన్స్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. ఇకపై వేరికోజ్ వీన్స్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని స్పష్టం చేశారు.

Comments
Post a Comment