భారత పార్లమెంట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది.

భారత పార్లమెంట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. మరికొన్ని గంటల్లో మరో చారిత్రక ఘటనకు వేదిక కానుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీని జులై 1 నుంచి అమలు చేస్తోంది. దీని కోసం శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక ఆర్థిక సంస్కరణల ఆరంభం కోసం పార్లమెంట్‌ను అందంగా ముస్తాబు చేశారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణం విద్యుత్ ధగధగలతో మెరిసిపోతోంది. భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.
ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే అర్థరాత్రి వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. 1947 ఆగస్ట్ 15న భారత్‌కు స్వాత్రంత్యం వచ్చిన సందర్భంగా తొలిసారి,

1972 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 25 ఏళ్ళైన సందర్భంగా సిల్వర్ జుబ్లీ వేడుకలప్పుడు రెండోసారి నిర్వహించారు. అలాగే స్వాత్రంత్యం వచ్చి 50 ఏళ్ళైన సందర్భంగా 1997 ఆగస్ట్ 15న గోల్డెన్ జుబ్లీ వేడుకల కోసం మూడోసారి అర్థరాత్రి వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. అయితే దీనికి భిన్నంగా జీఎస్టీ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. పార్లమెంట్ సంప్రదాయాలను తుంగలో తొక్కి జీఎస్టీ అమలు పేరుతో సంబరాలు నిర్వహిస్తోందని ఆరోపించింది. అందుకే తమ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు