కోచ్‌గా ద్రవిడ్‌కు మరో రెండేళ్లు పొడిగింపు: బీసీసీఐ ట్వీట్

కోచ్‌గా ద్రవిడ్‌కు మరో రెండేళ్లు పొడిగింపు: బీసీసీఐ ట్వీట్

ఇండియా  ఏ, అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ బీసీసీఐ జూన్ 30 (శుక్రవారం) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
2015లో పది నెలల పాటు ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉండేందుకు బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ద్రవిడ్ నేతృత్వంలోని ఇండియా ఏ, అండర్-19 జట్లు మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈ ఒప్పందాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.


కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన ముక్కోణపు సిరిస్‌లో ఇండియా ఏ జట్టు అద్భుత విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో అండర్-19 జట్టు ఫైనల్ వరకు వెళ్లింది.

2015లో తొలుత చేసుకున్న 10 నెలల కోచ్‌ పదవికి గాను బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌కి సుమారు రూ.4 కోట్లను వేతనంగా ఇచ్చింది. తాజా ఒప్పందంతో ద్రవిడ్‌కి ఇంకా పెద్ద మొత్తంలో అందుతుంది. ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు విషయం జూన్ నెల మొదట్లో జరిగిన బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌లో కూడా చర్చకు వచ్చింది.
గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా మండలి కూడా ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు అంగీకారం తెలిపింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు