Posts

Showing posts from September, 2017

కర్నూలు: మహానంది యందు ఈ నెల 21 నుండి 30 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Image

జూరాల ప్రాజెక్టునుంచి 14,664 క్యూసెక్కుల నీరు విడుదల

Image
జూరాల ప్రాజెక్టునుంచి 14,664 క్యూసెక్కుల నీరు విడుదల గద్వాల : జూరాల ప్రాజెక్టునుంచి స్పిల్‌ వే ద్వారా 14 వేల 664 క్యూసెక్కుల నీటిని అధికారులు నేడు విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్లు మూడు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 56 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 61,229 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 5.9 టిఎంసిలు, పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టిఎంసిలు.

జర్నలిస్టు గౌరి లంకేష్ హంతకుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష : రివార్డు కర్నాటక సర్కార్

Image
జర్నలిస్టు గౌరి లంకేష్ హంతకుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష : రివార్డు కర్నాటక సర్కార్ బెంగళూరు : సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హంతకులు ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయల రివార్డును కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టు గౌరి హత్య కేసును ఇప్పటికే సిట్ కు అప్పగించిన ప్రభుత్వం, తాజాగా ఆమె హంతకులు ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డును ప్రకటించింది.

జర్నలిస్టుల వరుస హత్యలపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి: మాయావతి

Image
జర్నలిస్టుల వరుస హత్యలపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి: మాయావతి లక్నో: జర్నలిస్టుల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ప్రముఖ జర్నలిస్టు,హేతువాది గౌరీ లంకేశ్‌ హత్యపై అమె అందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏ విచారణకు అదేశించాలని అమె డిమాండ్‌ చేశారు. అలాగే గతంలో ఇదే తరహాలో హత్యలకు గురైన నరేంద్ర దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే, ఎంఎం కల్బర్గీల,హత్యలపై కూడా ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని అన్నారు. కొద్ది కాల వ్యవధిలోనే జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారని,ఈ హత్యలకు గురవుతున్నారని, ఈ హత్యలను కేంద్ర ప్రభుత్వం కేవలం ఖండించడంతోనే చేతులు దులిపేసుకోకుండా వాటిపై సీరియస్‌గా దృష్టి సారించాలని ఆమె తెలిపారు.

వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య

Image
వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన ప్రేమకు భర్త అడ్డమని భావించిన ఆ మహిళా అతన్ని నమ్మించి కడతేర్చింది.  పెళ్లై పట్టుమని మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్న భార్యే, అతడిని కడతేర్చింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరానికి, ద్రాక్షారామానికి చెందిన జయలక్ష్మీ ఈ ఏడాది మేలో వివాహమైంది. జయలక్ష్మీ ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉంది. దీంతో భర్త అడ్డం తొలగించేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసింది. పెళ్లై మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్నవాడని కడతేర్చింది జయలక్ష్మీ. వీరేష్ తో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం తన భర్తకు తెలుస్తుందేమోనని భయపడుతూ గడిపింది ఆ మూడు నెలలు. ఇక తన ప్రేమాయణానికి భీమశంకరం అడ్డుకాకుడాదని భావించారు జయలక్ష్మీ, వీరేష్. దీంతో భర్తను నమ్మించి, భక్తి పేరుతో గుడికి తీసుకొచ్చి.. విషపూరి...

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ అవార్డు

Image
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ అవార్డు పర్యాటక ప్రాంతాల్లో GHMC కల్పించిన సౌకర్యాలకు కేంద్ర పర్యాటక శాఖ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ అవార్డు తమపై బాధ్యతను మరింత  పెంచిందన్నారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని... రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా సచివాలయం కడతాం: కర్నె

Image
ఎన్ని అడ్డంకులు వచ్చినా సచివాలయం కడతాం: కర్నె హైదరాబాద్‌: ప్రతిపక్షాలు నూతన సచివాలయాన్ని నిర్మించవద్దని అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా నిర్మించి తీరుతామని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ కార్యానికి ఎందుకు అడ్డుపడుతున్నాయో అర్ధం కావడం లేదని అన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో కనీస వసతులు కూడా లేవన్నారు. బైసన్‌ పోలో మైదానం అందరికీ దగ్గరలో ఉంటుందని పైగా మెట్రో సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు.

బీహార్ జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై కాల్పులు

Image
బీహార్ జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై కాల్పులు ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మర్చిపోక ముందే మరో జర్నలిస్ట్ పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌లోని అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రాష్ట్రీయ సహారా దినపత్రికలో ఆయన పని చేస్తున్నారు. ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి పంకజ్ మిశ్రాపై కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే పంజక్‌ మిశ్రా ఈరోజు మధ్యాహ్నం బ్యాంక్‌ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దుండగులు కాల్పులు జరిపి, ఆయన వద్ద నుండి నగదు దోచుకెళ్లినట్లు అరవల్‌ ఎస్పీ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాల

Image
బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన సమీక్ష జరిపారు. బతుకమ్మ పండుగ నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 26న దాదాపు 35 వేల మంది మహిళలతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ నెల 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు బతుకమ్మలను హుస్సేన్ సాగర్ లో వదలడానికి ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం వంటి పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని హైదరాబ...

హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనము

Image

91210 91210కు మిస్‌డ్‌ కాల్‌ ఇస్తే చాలు: ysrcp

Image
91210 91210కు మిస్‌డ్‌ కాల్‌ ఇస్తే చాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాంది ప‌లికారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా, పార్టీని బ‌లోపేతం చేసేందుకు కొత్త పంథాను ఎన్నుకున్నారు. తాను ఇటీవ‌ల ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప్ర‌తి ఇంటికి తీసుకెళ్లే బాధ్య‌త‌ను పార్టీ క్యాడ‌ర్‌పై పెట్టి వారి ద్వారా ప్ర‌తి ఒక్క‌రిని పార్టీలో చేర్చుకునేందుకు వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. 91210 91210 నంబ‌ర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే చాలు వారితో వైఎస్ జ‌గ‌న్ నేరుగా మాట్లాడేలా వాయిస్ రికార్డు చేశారు. ఆ త‌రువాత రెండు రోజుల్లోనే పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి వైసీపీ సిబ్బంది ఫోన్‌లో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వైయ‌స్ఆర్ కుటుంబం అనే పేరు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వైఎస్ జ‌గ‌న్ ఇవాళ పులివెందుల‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు, నిరుద్యోగులు ఇలా అం...

వైఎస్ఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి

Image
కడప:  దివంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, జిల్లా వైసీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. ఆయనతో పాటు వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిల, అనిల్‌, వైఎస్‌ భారతి, ఎంపీ అవినాష్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయకు చేరుకున్నారు.

‘బోల్డ్‌.. ఒరిజినల్‌.. బ్రిలియంట్‌.. ‘అర్జున్‌ రెడ్డి’ -మహేష్ ట్వీట్

Image
హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్ర బృందాన్ని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. చిత్రం కొత్త తరహాలో ఉందని, విజయ్‌ అద్భుతంగా నటించారని అన్నారు. కాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా ట్వీట్‌ చేశారు. ‘బోల్డ్‌.. ఒరిజినల్‌.. బ్రిలియంట్‌.. ‘అర్జున్‌ రెడ్డి’ సాధారణ మార్గాన్ని బ్రేక్‌ చేసిన చిత్రం. విజయ్‌ దేవరకొండ లైఫ్‌టైమ్‌ పర్ఫామెన్స్‌తో వచ్చారు. అద్భుతంగా చేశారని చెప్పడం కూడా తక్కువే. షాలిని, ఆమె స్నేహితుల పాత్రలు బ్రిలియంట్‌గా ఉన్నాయి. సందీప్‌రెడ్డి వంగా రచన, దర్శకత్వం చాలా బావున్నాయి. ఇది ఆయన తొలి చిత్రమంటే నమ్మడం చాలా కష్టం. మీకు, మీ మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.