Posts

సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న సీఎం కేసీఆర్

Image
సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న కేసీఆర్ తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మలను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కేసీఆర్ వనదేవతల గద్దెలవద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ పూజారులు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం. పసుపు, కుంకుమలు గద్దెలపై చల్లి పట్టువస్త్రాలు సమర్పించారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. సీఎం సతీమణి శోభ, మనవడు హిమాన్షులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు.
Image
నిర్మాణ సంస్థ‌: శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ తారాగ‌ణం: ర‌వితేజ‌, రాశిఖ‌న్నా, సీర‌త్‌క‌పూర్‌, ఫ్రెడ్డీ దారువాలా, ముర‌ళీశ‌ర్మ‌, స‌త్యం రాజేష్‌, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు సంగీతం: జామ్ 8 సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, ఛోటా కె.నాయుడు క‌ళ‌: ర‌మ‌ణ వంక‌ క‌థ‌: వ‌క్కంతం వంశీ మాట‌లు: దీప‌క్ రాజ్‌ నిర్మాత‌లు: న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీ ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ సిరికొండ‌ గ‌త ఏడాది `రాజా ది గ్రేట్‌`తో స‌క్సెస్ కొట్టారు. ఈ ఏడాది ప్రారంభంలోనే `ట‌చ్ చేసి చూడు` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమాలో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. ర‌వితేజ  సినిమాల్లోలాగా ఎంటర్టైన్మెంట్, కథ పవర్ ఫుల్ గా ఉంటుందా? లేదా సాదా సీదాగా ఉంటుందా? అని తెలియాలంటే ముందు కథేంటో చూద్దాం... కథ : పోలీస్ ఆఫీస‌ర్ గా ఉన్న కార్తీకేయ(రవితేజ) గా అకార‌ణంగా ఓ నిందితుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైనందుకు ఉద్యోగం నుంచి స‌స్పెండ్ అవుతాడు. అయితే ఉద్యోగం నుంచి స‌స్పెండ్ అయిన కార్తీకేయ పాండిచ్చేరిలో  సొంత‌గా కంపెనీ స్టార్ట్ చేస్తాడు.  ఒక రోజు కార్తీకేయ చెల్లెలు విద్యార్ది నాయ‌కుడిని హ‌త్...

కర్నూలు: మహానంది యందు ఈ నెల 21 నుండి 30 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Image

జూరాల ప్రాజెక్టునుంచి 14,664 క్యూసెక్కుల నీరు విడుదల

Image
జూరాల ప్రాజెక్టునుంచి 14,664 క్యూసెక్కుల నీరు విడుదల గద్వాల : జూరాల ప్రాజెక్టునుంచి స్పిల్‌ వే ద్వారా 14 వేల 664 క్యూసెక్కుల నీటిని అధికారులు నేడు విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్లు మూడు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 56 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 61,229 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 5.9 టిఎంసిలు, పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టిఎంసిలు.

జర్నలిస్టు గౌరి లంకేష్ హంతకుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష : రివార్డు కర్నాటక సర్కార్

Image
జర్నలిస్టు గౌరి లంకేష్ హంతకుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష : రివార్డు కర్నాటక సర్కార్ బెంగళూరు : సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హంతకులు ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయల రివార్డును కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టు గౌరి హత్య కేసును ఇప్పటికే సిట్ కు అప్పగించిన ప్రభుత్వం, తాజాగా ఆమె హంతకులు ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డును ప్రకటించింది.

జర్నలిస్టుల వరుస హత్యలపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి: మాయావతి

Image
జర్నలిస్టుల వరుస హత్యలపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి: మాయావతి లక్నో: జర్నలిస్టుల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ప్రముఖ జర్నలిస్టు,హేతువాది గౌరీ లంకేశ్‌ హత్యపై అమె అందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏ విచారణకు అదేశించాలని అమె డిమాండ్‌ చేశారు. అలాగే గతంలో ఇదే తరహాలో హత్యలకు గురైన నరేంద్ర దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే, ఎంఎం కల్బర్గీల,హత్యలపై కూడా ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని అన్నారు. కొద్ది కాల వ్యవధిలోనే జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారని,ఈ హత్యలకు గురవుతున్నారని, ఈ హత్యలను కేంద్ర ప్రభుత్వం కేవలం ఖండించడంతోనే చేతులు దులిపేసుకోకుండా వాటిపై సీరియస్‌గా దృష్టి సారించాలని ఆమె తెలిపారు.

వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య

Image
వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన ప్రేమకు భర్త అడ్డమని భావించిన ఆ మహిళా అతన్ని నమ్మించి కడతేర్చింది.  పెళ్లై పట్టుమని మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్న భార్యే, అతడిని కడతేర్చింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరానికి, ద్రాక్షారామానికి చెందిన జయలక్ష్మీ ఈ ఏడాది మేలో వివాహమైంది. జయలక్ష్మీ ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉంది. దీంతో భర్త అడ్డం తొలగించేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసింది. పెళ్లై మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్నవాడని కడతేర్చింది జయలక్ష్మీ. వీరేష్ తో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం తన భర్తకు తెలుస్తుందేమోనని భయపడుతూ గడిపింది ఆ మూడు నెలలు. ఇక తన ప్రేమాయణానికి భీమశంకరం అడ్డుకాకుడాదని భావించారు జయలక్ష్మీ, వీరేష్. దీంతో భర్తను నమ్మించి, భక్తి పేరుతో గుడికి తీసుకొచ్చి.. విషపూరి...