నిర్మాణ సంస్థ‌: శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌

తారాగ‌ణం: ర‌వితేజ‌, రాశిఖ‌న్నా, సీర‌త్‌క‌పూర్‌, ఫ్రెడ్డీ దారువాలా, ముర‌ళీశ‌ర్మ‌, స‌త్యం రాజేష్‌, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు

సంగీతం: జామ్ 8

సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, ఛోటా కె.నాయుడు

క‌ళ‌: ర‌మ‌ణ వంక‌

క‌థ‌: వ‌క్కంతం వంశీ

మాట‌లు: దీప‌క్ రాజ్‌

నిర్మాత‌లు: న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీ

ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ సిరికొండ‌

గ‌త ఏడాది `రాజా ది గ్రేట్‌`తో స‌క్సెస్ కొట్టారు. ఈ ఏడాది ప్రారంభంలోనే `ట‌చ్ చేసి చూడు` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమాలో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు.
ర‌వితేజ  సినిమాల్లోలాగా ఎంటర్టైన్మెంట్, కథ పవర్ ఫుల్ గా ఉంటుందా? లేదా సాదా సీదాగా ఉంటుందా? అని తెలియాలంటే ముందు కథేంటో చూద్దాం...

కథ : పోలీస్ ఆఫీస‌ర్ గా ఉన్న కార్తీకేయ(రవితేజ) గా అకార‌ణంగా ఓ నిందితుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైనందుకు ఉద్యోగం నుంచి స‌స్పెండ్ అవుతాడు. అయితే ఉద్యోగం నుంచి స‌స్పెండ్ అయిన కార్తీకేయ పాండిచ్చేరిలో  సొంత‌గా కంపెనీ స్టార్ట్ చేస్తాడు.  ఒక రోజు కార్తీకేయ చెల్లెలు విద్యార్ది నాయ‌కుడిని హ‌త్య‌ను క‌ళ్లారా చూస్తుంది. అదేవిష‌యాన్ని అన్న‌తో చెప్ప‌డంతో చెల్లెలితో సాక్ష్యం చెప్పించేందుకు పోలీస్టేష‌న్ కు వెళ‌తాడు. అక్క‌డ త‌న చెల్లి చెప్పిన నిందితుల్ని  ఇర్ఫాన్‌ లాలా(ఫ్రెడ్డీ దారువాలా)  గుర్తించిన కార్తీకేయ షాక్ తింటాడు. తాను చంపిన వ్య‌క్తి ఇక్క‌డ ప్ర‌త్యేక్ష‌మ‌వ్వ‌డం ఏంటీ..? బ‌్ర‌తికి ఉన్న ఇర్ఫాన్ లాలాను చనిపోయిన‌ట్లు ఎందుకు చూపించారు. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న కార్తికేయ‌కు ఇర్ఫాన్‌కు గొడవేంటి..? అన్నదే తెరపైన చూడాల్సిందే.

బ‌లాలు:

- ర‌వితేజ న‌ట‌న‌

- సినిమాటోగ్ర‌ఫీ

- నేప‌థ్య సంగీతం

- యాక్ష‌న్ పార్ట్‌

బ‌ల‌హీన‌త‌లు:

- రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ స్టోరీ

- సంగీతం

- హీరోయిన్స్‌కు త‌గిన స్కోప్ లేదు

- ర‌వితేజ గ‌త చిత్రాల‌ను పోలి ఉండ‌టం

విశ్లేషణ :
రవితేజ లాంటి మాస్ హీరోతో రొటీన్‌ సినిమా అయితే కరెక్ట్‌ అన్న నమ్మకంతో విక్రమ్ సిరికొండ మూస కథను ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. వక్కంతం వంశీ లాంటి స్టార్ రైటర్ అందించిన కథ అయిన ఎక్కడ కొత్త దనం కనిపించలేదు. ఎమోషనల్‌ యాక్షన్స్‌ సీన్స్ ను మరింత బలంగా రాసుకునే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా రొమాంటిక్‌ కామెడీ సీన్స్ మీద దృష్టి పెట్టాడు. తొలి భాగం అంతా అసలు కథలోకి వెల్లకుండా కేవలం రవితేజ, రాశీఖన్నా మధ్య సన్నివేశాలతో సాగదీశాడు. అవి కూడా ఆకట్టుకునే స్థాయిలో లేకపోవటం నిరాశపరుస్తుంది. ద్వితియార్థం కాస్త ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టినా..అదే ఊపు కొనసాగించలేకపోయాడు. ప్రతినాయక పాత్రను బలంగా రూపుదిద్దటంలోను దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. తన నేపథ్య సంగీతంతో మణిశర్మ సినిమాను కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిటోగ్రఫి,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరిగా:  ఇది రవితేజ సినిమా..
టచ్ చేసి చూడండి...


గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు