సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న కేసీఆర్
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మలను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కేసీఆర్ వనదేవతల గద్దెలవద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ పూజారులు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం. పసుపు, కుంకుమలు గద్దెలపై చల్లి పట్టువస్త్రాలు సమర్పించారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. సీఎం సతీమణి శోభ, మనవడు హిమాన్షులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Comments
Post a Comment