Posts

Showing posts from August, 2017

మార్కెట్, ఎం.పి.డి.ఒ కార్యాలయ భవనాలను ప్రారంభించిన మండలి విప్

Image
జనగామ: జనగామ పట్టణంలో కూరగాయల మార్కెట్, ఎం.పి.డి.ఒ కార్యాలయ భవనాలను ప్రారంభించిన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జెడ్.పి చేర్ పర్సన్ గద్దల పధ్మ, ఎం.ఎల్.ఏ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య

Image
బీహార్ క్యాడర్ కు చెందిన ఒక కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన మృతదేహం పక్కన సూసైడ్ నోట్ లభించడంతో ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేమిటి? సుసైడ్ నోట్ లో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉండగా, యూపీలోని ఘజియాబాద్ లో ఆయన మృతదేహం లభించడమేమిటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు

Image
న్యూఢిల్లీ : ఉప రాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ర్టపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఉప రాష్ర్టపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా పార్లమెంట్ కు చేరుకున్నారు వెంకయ్య. ఆ తర్వాత రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య ఆసీనులయ్యారు. రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్.. వెంకయ్య చేత ప్రమాణస్వీకారం చేయించారు. 

తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడవ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్

Image
హైదరాబాద్: తాజ్‌డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడవ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంపై విస్తృతంగా చర్చ జరిగింది, తెలంగాణ వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అపోహలు సృష్టించరని, తెలంగాణ  వస్తే కరెంట్ ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి బయపెట్టరని, రియల్‌ఎస్టేట్ పడిపోతదని అప్పటి నేతలు అన్నరని తెలిపారు. ఆదాయం వృద్ధి రేటు సహా 12 రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్‌లో క్రైంరేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

జనగామ: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నా కలెక్టర్, ఎమ్మెల్యే

Image
జనగామ జిల్లా: జిల్లాలోని రఘునాథ పల్లి , ఖిలాషాపురం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నా జిల్లా కలెక్టర్ శ్రీ.దేవసేన, ఎమ్మెల్యే టి. రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళల రక్షణకు హెల్ప్ లైన్ నంబర్:తెలంగాణ ప్రభుత్వం

Image
మహిళల రక్షణకు తెలంగాణ సర్కారు మరో ముందడుగు మహిళా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే వారి రక్షణకు అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఈ హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులోకి రాబోతోంది. ఒక్క పోన్ కాల్ తో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు టోల్ ప్రీ నెంబర్ 181 కేటాయించింది ప్రభుత్వం.ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, మొదట హైదరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతోంది. సిటీలో మహిళలను బస్టాపుల్లో,రోడ్లపై, ఆపీసుల్లోను వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో ఈ టోల్ ప్రీ నెంబర్ వారికి ఉపయోగంగా ఉండనుందని మహిళా రక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.ఐటీ ప్రాంతాలపై ముఖ్యంగా దృష్టి పెట్టినట్లు వారు తెలిపారు. దశల వారిగా మిగతా జిల్లాకు దీన్ని విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.పోకిరీల బారినుంచే కాకుండా అత్తమామలు, బంధువులు, ఇతర నేరస్థుల బారి నుంచి మహిళలను కాపాడేందుకు ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడనుంది.ఇప్పటికే షి టీమ్ లు కూడా మహిళారక్షణకు పనిచేస్తుండగా,దీన్ని అనుసంధానం చేసుకుని హెల్ప్ లైన్ సెంటర్ ప...

జోధ్‌పూర్ కోర్టుకు స‌ల్మాన్ ఖాన్‌

Image
జోధ్‌పూర్ కోర్టుకు స‌ల్మాన్ ఖాన్‌ జోధ్‌పూర్: అక్ర‌మ ఆయుధాలు క‌లిగి ఉన్న కేసులో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇవాళ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఈ కేసులో స‌ల్మాన్‌ను నిర్దోషిగా కోర్టు పేర్కొన్న‌ది. అయితే 20 వేల బెయిల్ బాండ్‌పై సంత‌కం చేయాల్సి ఉన్న కార‌ణంగా స‌ల్మాన్ ఇవాళ కోర్టుకు వ‌చ్చారు. అక్ర‌మ ఆయుధాలు క‌లిగి ఉన్న స‌ల్మాన్‌పై 1998 అక్టోబ‌ర్‌లో కేసు న‌మోదు అయ్యింది. .

డ్రగ్స్ లేడీ డాన్ సంగీత అరెస్టు

Image
డ్రగ్స్ లేడీ డాన్ సంగీత అరెస్టు హైదరాబాద్: డ్రగ్స్ లేడీ డాన్ సంగీతను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులపాటు విచారించిన అధికారులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో పలు నిజాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే సంగీతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా వెలుగుచూశాయి.సంగీత డ్రగ్స్ సప్లయితో పాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అమ్మాయిల న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ సంగీత గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు సమాచారం.  ప్రియుడు జాన్ తో కలిసి సంగీత డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది. నగర శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ సప్లయి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఉచ్చులో బంజారాహిల్స్ కు చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యాపారుల పిల్లలను పోలీసులు విచారించారు. అన్నారపు పవన్, సంగీతరెడ్డి, అమరసింహారెడ్డి, ఆకాశ్, సోమాయిల్ జాన్, అర్జున్ రెడ్డిలను పోలీసులు విచారించారు. వారి నుంచి రక్తపు నమూనాలను పోలీసులు సేకరించారు.